ప్రభాస్ సినిమా కోసం 30 కోట్లతో భారీ సెట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సినిమా కోసం 30 కోట్లతో భారీ సెట్

  • 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ప్రభాస్
  •  పరిశీలనలో 'జాన్' టైటిల్ 
  • కథానాయికగా పూజా హెగ్డే  
ప్రభాస్ ఒక వైపున 'సాహో' సినిమా షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమాను కూడా కానిచ్చేస్తున్నాడు. 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారు .. గోపీకృష్ణ మూవీస్ వారు కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి  'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగును యూరప్ లో కొంతవరకూ చిత్రీకరించారు. ఇకపై అక్కడ చేయవలసిన సన్నివేశాలను, కొన్ని కారణాల వలన హైదరాబాద్ లోనే చేయడానికి సిద్ధమయ్యారు. 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా ఒక భారీ సెట్ ను వేయిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగు ఇందులోనే జరుగుతుందని చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, 'సాహో' తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది.
prabhas
pooja hegde

More Telugu News