యశోద ఆసుపత్రిలో నర్సారెడ్డిని పరామర్శించిన రేవంత్
- దీక్ష భగ్నం చేసి యశోదకు తరలించిన పోలీసులు
- ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్న నర్సారెడ్డి
- న్యాయం జరిగే వరకూ కొనసాగిస్తానని స్పష్టం
నేడు నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగిస్తానని స్పష్టంచేశారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహారం చెల్లించాలని నర్సారెడ్డి, సీఎం కేసీఆర్‌ను కోరారు.