కోల్ కతాలో అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ప్రతిగా రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు
- కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్ద ఘటన
- పెద్ద మొత్తంలో హాజరైన బీజేపీ కార్యకర్తలు
- రోడ్డు పక్కన వాహనాలకు నిప్పు పెట్టిన శ్రేణులు
ఘటనతో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు నిప్పంటించాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగినట్టు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ర్యాలీలో చెలరేగిన ఘర్షణపై అమిత్ షా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, ఈ ఘటనపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.