డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన హీరోయిన్ పూజా హెగ్డే... మేనేజర్ వివరణ!
- ఇటీవల 'మహర్షి' యూనిట్ పార్టీ
- ఆపై డ్రంకెన్ డ్రైవ్ లో పూజా దొరికినట్టు వార్తలు
- కారులో డ్రైవర్ తోనే వెళ్లారని మేనేజర్ స్పష్టీకరణ
తామంతా పార్టీ చేసుకున్న మాట వాస్తవమేనని, అయితే, సినిమా ప్రొడక్షన్ టీమ్, అందరికీ వాహనాలను సమకూర్చిందని చెప్పారు. పైగా, ఆ సమయంలో పూజా హెగ్డే తన విమానాన్ని అందుకోవాల్సి ఉండడంతో ఓ డ్రైవర్ ను ఇచ్చి మరీ డ్రాప్ చేయించామని, ఆ సమయంలో పోలీసుల తనిఖీలు జరుగుతుండగా, కారులో పూజ కనిపించారే తప్ప, ఆమె పట్టుబడిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు.