vaishnav tej: మెగా హీరో సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ మధ్య ఒక సినిమాను లాంచ్ చేశారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

 సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడు మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడిగా కనిపిస్తాడు. అందువలన ఈ సినిమాకి 'జాలరి' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమాకి 'ఉప్పెన' అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారనే సంగతి తెలిసిందే.
Go Back to Shorts
vaishnav tej

More Telugu News