పవన్ కల్యాణ్ పాటకు పైకిలేచి చప్పట్లు కొట్టిన జెన్నిఫర్ లోపెజ్
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ పాటకు పైకిలేచి చప్పట్లు కొట్టిన జెన్నిఫర్ లోపెజ్

  • ఇంటర్నేషనల్ రియాల్టీ షోలో భారత గ్రూప్ 'ద కింగ్స్' అద్భుత ప్రదర్శన
  • న్యాయనిర్ణేతగా జెన్నిఫర్ లోపెజ్
  • సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు కింగ్స్ ప్రదర్శనకు ముగ్ధురాలైన లోపెజ్
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నిరాశపర్చి ఉండొచ్చు కానీ, అందులో సంగీతం మాత్రం హిట్టేనని చెప్పాలి. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు కొందరు భారత యువకులు చేసిన డ్యాన్స్ అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ను సైతం ముగ్ధురాలిని చేసింది.

ఓ అంతర్జాతీయ చానల్ లో ప్రసారమయ్యే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాల్టీ షోలో జెన్నిఫర్ లోపెజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన 'ద కింగ్స్' అనే గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది. ఫినాలే షో సందర్భంగా 'ద కింగ్స్' సర్దార్ గబ్బర్ సింగ్ లోని 'వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా' అనే పాటకు '300' సినిమా కాన్సెప్ట్ ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేసింది.

స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో 'ద కింగ్స్' బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ ఉద్వేగం పట్టలేకపోయారు. తన సీట్లోంచి పైకి లేచి మరీ 'ద కింగ్స్' ప్రదర్శన పట్ల కరతాళ ధ్వనులతో అభినందించారు.

Pawan Kalyan
USA

More Telugu News