పవన్ కల్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు: హరిరామజోగయ్య
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు: హరిరామజోగయ్య

  • పవన్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారు
  • జనసేనకు 20 స్థానాల వరకు రావొచ్చు
  • టీడీపీ, వైసీపీ 90 స్థానాలకు మించవు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అవకాశాలపై సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య తన అభిప్రాయాలు వెల్లడించారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితుల ప్రభావంతో పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశాలు ఉన్నాయని, ఆయన కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని జోస్యం చెప్పారు. జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో 20 స్థానాల వరకు రావొచ్చని, దాంతో పవన్ సీఎం అన్నా కావాలి, లేకపోతే సీఎంను నిర్ణయించే కింగ్ మేకర్ అన్నా కావాలి అని పేర్కొన్నారు. పోలింగ్ ట్రెండ్ చూస్తుంటే టీడీపీ, వైసీపీలలో ఎవరికీ మెజారిటీ రావడం కష్టమేనని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే పవన్ కల్యాణే కీలకంగా మారతారని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan
Telugudesam
Jana Sena
YSRCP

More Telugu News