మోదీ, అమిత్ షాల ‘కోడ్’ ఉల్లంఘన.. ఈసీకి డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు
- ‘కోడ్’ ఉల్లంఘించేలా మోదీ, అమిత్ షా ప్రసంగాలు
- ఈసీ చర్యలు చేపట్టకపోవడంపై కాంగ్రెస్ పిటిషన్
- ఈ నెల 6లోపు నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు
ఈసీకి అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని, మరో 9 ఫిర్యాదులపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టుకు ఈసీ స్పష్టం చేసింది. ఆ ఫిర్యాదులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ ఆదివారం వరకు సమయం ఉన్నందున మిగిలిన ఫిర్యాదులపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించిన సుప్రీంకోర్టు, ఈ కేసు విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.