మాటలు జాగ్రత్తగా రానీ కేటీఆర్.. నేను రెచ్చిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది!: వి.హనుమంతరావు వార్నింగ్
- వీహెచ్ ను బఫూన్ అన్న టీఆర్ఎస్ నేత కేటీఆర్
- తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ పుట్టనేలేదని వ్యాఖ్య
- హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ సీనియర్ నేత
హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో వీహెచ్ మాట్లాడారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలు ఫిరాయించే నేతలపై ప్రజలు తిరగబడాలనీ, వారి ఇళ్లపై దాడులు చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు. కేటీఆర్ తన బావమరిది స్నేహితుడికి టెండర్ అప్పగించారన్నారు. బావమరిది మీద మోజుతో 22 మంది విద్యార్థులను కేటీఆర్ బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.