Uttar Pradesh: పాములను ధైర్యంగా చేతుల్లోకి తీసుకున్న ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్!

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్ చార్జ్ ప్రియాంకా గాంధీ ఈరోజు రాయ్ బరేలీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా తన తల్లి సోనియా గాంధీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాములు పట్టేవారిని కలుసుకున్న ప్రియాంక, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వీరందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని పాములను ప్రియాంకా గాంధీ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Go Back to Shorts
Uttar Pradesh
raibareli
Congress
snake charmers
Viral Videos

More Telugu News