ప్రేమకథా నేపథ్యంలో విక్కీ కౌశల్ జోడీగా కత్రినా కైఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమకథా నేపథ్యంలో విక్కీ కౌశల్ జోడీగా కత్రినా కైఫ్

  • 'యురి'తో హిట్ కొట్టిన విక్కీ కౌశల్
  • యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • లవ్ స్టోరీ చేయడానికి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ యంగ్ హీరోల్లో విక్కీ కౌశల్ పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. 'యురి ది సర్జికల్ స్ట్రైక్' సినిమాతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోయింది. 'యురి' చిత్రం 200 కోట్లకి పైగా వసూలు చేయడంతో, విక్కీతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కత్రినా కైఫ్ తో రొమాన్స్ చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

'యురి' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన రోన్ని స్క్రూవాలా, విక్కీతో మరో సినిమాను ప్లాన్ చేశారట. నిజజీవితంలో జరిగిన ఒక ప్రేమకథను తెరపైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కత్రినాతో సంప్రదింపులు జరపగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.
vicky kaushal
katrina

More Telugu News