nani: 'జెర్సీ' 11 రోజుల వసూళ్లు

షార్ట్స్‌లో చూడండి
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే విడుదలైన అన్నిప్రాంతాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ కి కథలోని ఎమోషన్ కనెక్ట్ అయింది. దాంతో మౌత్ టాక్ తో ఈ సినిమా అన్ని థియేటర్స్ లోను పరుగులు తీస్తోంది.

11 రోజుల్లో ఈ సినిమా 25 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమా లాభాల బాటపట్టనుందని అంటున్నారు. ఈ సినిమాకి వచ్చిన టాక్ పరంగా చూసుకుంటే, ఇప్పటికే వసూళ్లు మరింత పెరగాలి .. లాభాల బాట పట్టేయాలి. కానీ ఈ సినిమాతో పాటే విడుదలై వసూళ్లపరంగా 'కాంచన 3' ఒక దెబ్బకొడితే, వసూళ్లు పుంజుకుంటూ ఉండగా 'అవెంజర్స్ ఎండ్ గేమ్' వచ్చి మరింతగా దెబ్బకొట్టిందని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
nani
shraddha srinadh

More Telugu News