వర్మా.. వైఎస్ కుటుంబం చేసిన హత్యలపై సినిమా తీసే దమ్ము నీకు ఉందా?: టీడీపీ నేత మాల్యాద్రి
- జగన్ ఒక్క ప్రజా సమస్యపై కూడా స్పందించలేదు
- వర్మ సినిమాపై ఆగమేఘాల మీద ట్వీట్ చేశారు
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
‘గత 18 రోజుల్లో ఒక్క ప్రజా సమస్యపై అయినా జగన్ స్పందించాడా? కానీ ఒక అశ్లీల సినిమాల నిర్మాత, దర్శకుడు వర్మ సినిమాపై మాత్రం ఆగమేఘాల మీద ఎందుకు ట్వీట్ చేశారు? ఈ సినిమాను మీరే తీశారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని మాల్యాద్రి స్పష్టం చేశారు. ‘మే 23 వరకూ చంద్రబాబు ఆగలేరా అని పదేపదే ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలకు ఓ ప్రశ్న. మే 23 వరకూ వర్మ ఎందుకు ఆగలేడు? జగన్ ఎందుకు ఆగలేడు? అన్నదానిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. వర్మను కూడా ఓ ప్రశ్న అడుగుతున్నాం. వైఎస్ కుటుంబం చేసిన హత్యలపై సినిమా తీసే దమ్ము ఈ వర్మకు ఉందా?’ అని సవాల్ విసిరారు.