'దృశ్యం' దర్శకుడితో కార్తీ సినిమా మొదలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దృశ్యం' దర్శకుడితో కార్తీ సినిమా మొదలు

  • కార్తీ తాజా చిత్రంగా రానున్న 'ఖైదీ'
  • జీతూ జోసెఫ్ తో తదుపరి సినిమా
  •  లైన్లో 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్
కొంతకాలంగా కార్తీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'దేవ్' సినిమా నిరాశ పరిచిన తరువాత కథల విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా ఆయన వరుసగా ముగ్గురు దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ తాజా చిత్రంగా 'ఖైదీ' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది.

ఈ సినిమా తరువాత ఆయన 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమా షూటింగు ఈ రోజున మొదలైంది. వైవిధ్యభరితమైన ఈ సినిమాలో జ్యోతిక .. సత్యరాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ప్రాజెక్టును కార్తీ పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి కార్తీ ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా వున్నాడన్న మాట.
karthi

More Telugu News