లారెన్స్ కోసం కదిలిన హిజ్రాలు .. దివ్యాంగులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లారెన్స్ కోసం కదిలిన హిజ్రాలు .. దివ్యాంగులు

  • లారెన్స్ పై సీమాన్ విమర్శలు 
  • ఫిర్యాదుకి సిద్ధమైన హిజ్రాలు ..  దివ్యాంగులు
  • త్వరలో ఒక నిర్ణయానికి వస్తానన్న లారెన్స్ 
తమిళనాట లారెన్స్ కి .. 'నాన్ తమిళర్ కట్చి' చీఫ్ కన్వీనర్ సీమాన్ కి మధ్య వివాదం రోజురోజుకి పెరిగిపోతోంది. లారెన్స్ చేసే సేవాకార్యక్రమాలన్నీ పబ్లిసిటీ కోసం చేసేవేనంటూ సీమాన్ తీవ్రమైన విమర్శలు చేస్తూనే వున్నాడు. తనని విమర్శించినా ఫరవాలేదుగానీ తనని అభిమానించే హిజ్రాలపై .. దివ్యాంగులపై 'నాన్ తమిళర్ కట్చి' కార్యకర్తలు దాడులు చేయడం మానుకోవాలని లారెన్స్ విజ్ఞప్తి చేశాడు కూడా.

అయినా 'నాన్ తమిళర్ కట్చి' కార్యకర్తలు విమర్శలను .. దాడులను ఆపలేదు. దాంతో లారెన్స్ కి సపోర్ట్ గా నిలుస్తూ సీమాన్ పై ఫిర్యాదు చేయడానికి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో హిజ్రాలు .. దివ్యాంగులు సిద్ధమయ్యారు. ఈ విషయంలో తొందరపడొద్దని వాళ్లని లారెన్స్ వారించాడు. ప్రస్తుతం తాను 'కాంచన' హిందీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నాననీ, షూటింగు పూర్తయిన తరువాత ఈ వివాదంపై ఒక నిర్ణయానికి వస్తానని చెప్పాడు. 
lawrence

More Telugu News