త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలో హన్సిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలో హన్సిక

  • అందాల కథానాయికగా హన్సికకి పేరు
  • కీలకమైన పాత్రను ఆఫర్ చేసిన త్రివిక్రమ్
  • కెరియర్లో డిఫరెంట్ రోల్ అవుతుందంటూ టాక్  
త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఈ రోజునే సెట్స్ పైకి వెళ్లింది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో టబు .. తండ్రి పాత్రలో జయరామ్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం హన్సికను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ పాత్రను చాలా కొత్తగా .. ఆసక్తికరంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ పాత్రలో హన్సికను కొత్తకోణంలో చూపించనున్నట్టు చెబుతున్నారు. హన్సిక కెరియర్లో ఆమె చేసిన విభిన్నమైన పాత్రల్లో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు. గతంలో 'దేశముదురు' సినిమాలో అల్లు అర్జున్ సరసన అందాల నాయికగా అలరించిన హన్సిక, ఇప్పుడు ఆయన సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం విశేషం. 
trivikram
allu arjun

More Telugu News