nani: నాని సత్తాను మరోసారి నిరూపించిన 'జెర్సీ'

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై సహజనటుడిగా నానీకి మంచి పేరు వుంది. ఆయన ఒక కథను ఒప్పుకున్నాడు అంటే, అందులో తప్పకుండా విషయం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వుంది. అలాంటి నమ్మకంతోనే 'జెర్సీ' సినిమాకి వచ్చిన ప్రేక్షకులు, ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఆడియన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేసింది. ఈ కారణంగానే అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. 5 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 1 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో నాని ఈ ఫీట్ ను సాధించడం ఇది ఆరోసారి. ఫుల్ రన్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సక్సెస్ కారణంగా శ్రద్ధా శ్రీనాథ్ కి ఇక్కడ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి నాని ఖాతాలో మరో భారీ హిట్ చేరిపోయింది. 
Go Back to Shorts
nani
shraddha srinadh

More Telugu News