nani: 'జెర్సీ' కథను నాకంటే ఎక్కువగా నాని నమ్మాడు: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

షార్ట్స్‌లో చూడండి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా రూపొందిన 'జెర్సీ' నిన్ననే థియేటర్లకు వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నాని క్రికెటర్ గా కనిపించాడు. తొలి రోజునే ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చేసింది. నానీకి .. దర్శక నిర్మాతలకి అభినందనలు తెలిపే ప్రముఖుల సంఖ్య పెరుగుతూపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ .. " ఈ కథను నానికి వినిపించగానే చేసేద్దాం అన్నాడు. ఆయన కాన్ఫిడెంట్ చూసి నాకు భయం వేసింది. నాకంటే ఈ కథను ఆయన ఎక్కువగా నమ్మాడు. 'అర్జున్' పాత్రను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక విడుదలకి ముందురోజున నాకు నిద్రకూడా పట్టలేదు. ఇంతమంది నాపై పెట్టుకున్న నమ్మకం నిలబడుతుందా? అని టెన్షన్ పడ్డాను. తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మనసు కాస్త కుదుటపడింది. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు వున్నాయి. కొంత సమయం తీసుకుని, మళ్లీ రంగంలోకి దిగుతాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
nani
shraddha srinadh

More Telugu News