Congress: కాంగ్రెస్ పార్టీకి ఝులక్.. రాజీనామా చేసిన ప్రియాంకా చతుర్వేది!

షార్ట్స్‌లో చూడండి
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కీలక మహిళా నేత ప్రియాంకా చతుర్వేది రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేసినవారికి గుర్తింపు లేదనీ, అందుకే రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది తెలిపారు. పార్టీలో రక్తం ధారబోసినవారికి కాకుండా నిరక్షరాస్యులైన గూండాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనే ట్యాగ్ ను ఆమె తొలగించారు. యూపీలోని మధురలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులను పార్టీలోకి మళ్లీ చేర్చుకోవడంపై ఆగ్రహించిన ప్రియాంక చతుర్వేది, పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో రెండేళ్లుగా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.
Go Back to Shorts
Congress
priyanka chaturwedi
resign

More Telugu News