Andhra Pradesh: నాకు బెస్ట్ కమెడియన్ గా అవార్డు రావాల్సింది.. చివరి నిమిషంలో పేరును తీసేశారు!: వైసీపీ నేత పృథ్వీ

షార్ట్స్‌లో చూడండి
హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమాకు తనకు బెస్ట్ కమెడియన్ అవార్డు రావాల్సిందని ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీ తెలిపారు. ఈ విషయాన్ని చాలామంది తనకు చెప్పారని వ్యాఖ్యానించారు. అయితే చివరి నిమిషంలో తన పేరును అవార్డుల జాబితా నుంచి తప్పించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ పార్టీ జెండాను పట్టుకుని ఉంటే ఆ ఆవార్డు వచ్చేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ పలు అంశాలపై ముచ్చటించారు.

తనకు అవార్డులు రాకపోయినా ఫరవాలేదనీ, దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ అవార్డుకు అన్నివిధాల అర్హుడైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో కైకాల పనిచేశారని గుర్తుచేశారు. అలాంటిది ఆయనకు ఇవ్వకుండా కమల్ హాసన్ కు ఎన్టీఆర్ అవార్డును ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను కైకాలను డాడీ అని  పిలుస్తా.. ఇదేంటి డాడీ అని అడిగితే.. ఇవన్నీ నాకు నచ్చవు. నేను భజన చేసేవాడిని కాదు’ అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. గత ఐదేళ్లలో ఏపీలో ఇలాంటి దరిద్రాలన్నీ జరిగాయని విమర్శించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Telugudesam
prudhvi

More Telugu News