త్రివిక్రమ్ సినిమా విషయంలో పట్టు సడలించిన బన్నీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ సినిమా విషయంలో పట్టు సడలించిన బన్నీ!

  • త్వరలో సెట్స్ పైకి త్రివిక్రమ్ - బన్నీ 
  • సెకండాఫ్ పై త్రివిక్రమ్ కసరత్తు
  •  రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టేసిన బన్నీ
ఏ సినిమాకైనా కథాకథనాలు .. పాత్రల్లోని వైవిధ్యం ప్రధానమని అల్లు అర్జున్ భావిస్తాడు. అందువలన ఆయన కథాకథనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. స్క్రిప్ట్ పక్కాగా వచ్చిందనే సంతృప్తి కలిగిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అప్పటివరకూ మార్పులు .. చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా విషయంలో మాత్రం ఆయన తన పట్టును సడలించాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

త్రివిక్రమ్ ఫస్టాఫ్ స్క్రిప్ట్ మాత్రమే అల్లు అర్జున్ కి వినిపించాడట. సెకండాఫ్ లో అల్లు అర్జున్ చెప్పిన మార్పులు ఇంకా త్రివిక్రమ్ చేయలేదు. ఒక వైపున ఫస్టాఫ్ షూటింగు నడుస్తుండగానే సెకండాఫ్ ను సెట్ చేస్తానని త్రివిక్రమ్ చెప్పడంతో ఓకే అన్నాడని అంటున్నారు. ఈ నెల 23 .. 24 తేదీల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ హీరోగా వేణు శ్రీరామ్ .. సుకుమార్ ప్రాజెక్టులు లైన్లో వున్నాయి. అందువలన ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని అల్లు అర్జున్ తన పట్టు సడలించినట్టుగా చెప్పుకుంటున్నారు.
allu arjun
pooja hegde

More Telugu News