Gujarath: ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా 31 మంది మృతి

షార్ట్స్‌లో చూడండి
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో 16 మంది, గుజరాత్ లో 9 మంది, రాజస్థాన్ లో ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్, పిలానీ, అజ్మేర్, చిత్తోర్ ఘర్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
Go Back to Shorts
Gujarath
Madhya Pradesh
Rajasthan
rains

More Telugu News