'కాంచన 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కాంచన 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే

  • లారెన్స్ నుంచి మరో హారర్ థ్రిల్లర్ 
  • దసపల్లా కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 19వ తేదీన విడుదల        
లారెన్స్ ప్రధాన పాత్రధారిగా, ఆయన దర్శకత్వంలో 'కాంచన 3' రూపొందింది. ఏప్రిల్ 19వ తేదీన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వేదిక .. ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేశారు. రేపు (బుధవారం) సాయంత్రం 6 గంటల నుంచి, హైదరాబాద్ - దసపల్లా కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

ఇంతవరకూ తాను రూపొందించిన హారర్ థ్రిల్లర్ సినిమాలకి మించి 'కాంచన 3' ఉంటుందని లారెన్స్ చెప్పాడు. కథా కథనాల విషయంలోను మునుపటి సినిమాలకి భిన్నంగా ఉంటుందని అన్నాడు. ఇక ఇప్పటికే లారెన్స్ డిఫరెంట్ లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారిలో ఆత్రుత పెరిగిపోతోంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి. 
lawrence
vedika
oviya

More Telugu News