తండ్రి, సోదరి కాంగ్రెస్‌లో.. తన ఓటు మాత్రం బీజేపీకేనన్న టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా
- గత నెలలో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబా
- ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జడేజా తండ్రి, సోదరి
- తాను మాత్రం తన భార్యవైపేనంటూ జడేజా ట్వీట్
మరోవైపు, రవీంద్ర జడేజా తండ్రి అనురుధ్ సిన్హ్, సోదరి నైనాబాలు ఈ నెల 14న కాంగ్రెస్‌లో చేరి జడేజాకు షాకిచ్చారు. దీంతో ఒకే కుటుంబంలో ప్రత్యర్థులు పుట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా ఎటువైపు నిలుస్తాడన్న చర్చ జోరుగా సాగింది. దీంతో తాజాగా ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పెడుతూ తాను తన భార్యవైపేనని స్పష్టం చేశాడు. తన మద్దతు బీజేపీకేనంటూ ట్వీట్ చేశాడు.