nani: 'జెర్సీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెంకటేశ్

షార్ట్స్‌లో చూడండి
ఒకే తరహా సినిమాలు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడనే విమర్శ ఎదురుకాగానే నాని తన రూటు మార్చుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుని, 'జెర్సీ'తో ఆచరణలో పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది.

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈలోగా .. అంటే ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు రాత్రి 7గంటల 30 నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ .. స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో నాని ఖాతాలోకి మరో హిట్ చేరడం ఖాయమనేది అభిమానుల మాట.
Go Back to Shorts
nani
shraddha srinadh

More Telugu News