నా భర్త స్నానం చేయడం లేదు.. విడాకులివ్వండి!: కోర్టును ఆశ్రయించిన భార్య

మన దేశంలో వైవాహిక బంధాలు నానాటికీ బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు కావాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ లో మరొకటి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, ఒక జంట ఏడాది క్రితమే పెళ్లి చేసుకుంది. ఇంతలోనే వారి పెళ్లి పెటాకులయ్యే పరిస్థితి వచ్చింది. తనకు విడాకులు కావాలంటూ భార్య భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకులు ఎందుకు కావాలని కోర్టు ఆమెను ప్రశ్నించగా... రోజుల తరబడి ఆయన స్నానం చేయడం లేదని, గడ్డం తీయడం లేదని ఆమె తెలిపింది. తాను గట్టిగా నిలదీస్తే పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడని చెప్పింది. ఈ వాదనలు విన్న కోర్టు భార్యాభర్తలు ఇద్దరూ ఆరు నెలల పాటు విడివిడిగా ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాతే విడాకులు మంజూరు చేస్తామని తెలిపింది.
Go Back to Shorts
divorce
Madhya Pradesh
bhopal

More Telugu News