ముస్లిం యువతితో శింబు సోదరుడి పెళ్లి.. రజనీకాంత్ కు ఆహ్వానం!
- ఈనెల 26న చెన్నైలో నిఖా
- ఇటీవల ఇస్లాం స్వీకరించిన కురలరసన్
- తమ్ముడి పెళ్లిపై హర్షం వ్యక్తంచేసిన శింబు
నిబిలా అహ్మద్ అనే యువతి, కురలరసన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కాగా, సోదరుడి వివాహంపై శింబు సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు కురలరసన్ తండ్రి, దర్శక-నిర్మాత టి.రాజేందర్ పెళ్లి పత్రికలు పంచడంలో బిజీగా ఉన్నారు. తాజాగా రాజేందర్ కుమారుడు కురలరసన్ తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెళ్లి పత్రికను అందజేశారు.