ఈసారి జనసేనకు అవకాశం లేదు!: సినీ నటుడు కృష్ణుడు
- ప్రతిపక్షంగా వైసీపీ బలంగా ఉంది
- జనసేన ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టం
- ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణుడు వ్యాఖ్య
టీడీపీ 40 సీట్లను వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచిందనీ, మరో 20-30 సీట్లను 2-3 వేల ఓట్ల తేడాతో దక్కించుకుందని గుర్తుచేశారు. ఇందుకు పవన్ ఫ్యాక్టర్ కూడా ఓ కారణం కావచ్చన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణుడు మాట్లాడుతూ.. ఈసారి జనసేనకు తగినంత అవకాశం లేదన్నది తన అభిప్రాయమన్నారు. 1980ల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎన్టీ రామారావు టీడీపీని పెట్టారనీ, అప్పుడు ఆ వ్యాక్యూమ్ ఉందని అన్నారు. కృష్ణుడు ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.