పూరి అడిగితే నో చెప్పేసి తప్పుచేశాను: నటుడు సంపూర్ణేశ్ బాబు
- డ్రామాలు .. నాటకాలు ఇష్టం
- 'లోఫర్'లో ఛాన్స్ వస్తే నో చెప్పాను
- పూరిని కలిసి ఛాన్స్ అడిగాను
'హృదయ కాలేయం' విడుదలైన తరువాత, పూరి జగన్నాథ్ గారు నన్ను పిలిపించి మరీ, 'లోఫర్' లో ఒక వేషం వేయమన్నారు. ఆ సమయంలో నేను హీరోగా చేసిన 'కొబ్బరిమట్ట' విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో .. 'ఇప్పుడు చేయలేను సార్' అని చెప్పాను. అలా పూరి సినిమాలో ఛాన్స్ ను వదులుకోవడమే నేను చేసిన తప్పు అని ఇప్పటికీ అనుకుంటూ వుంటాను. ఆ తరువాత పూరిగారిని కలిసి వేషం ఇవ్వమని అడిగాను .. ఇంతవరకూ ఇవ్వలేదు .. త్వరలో ఇస్తారేమో చూడాలి" అని చెప్పుకొచ్చాడు.