lawrence: 'కాంచన 3'పై అందరిలో పెరుగుతోన్న ఆసక్తి

షార్ట్స్‌లో చూడండి
దర్శకుడిగా .. కథానాయకుడిగా లారెన్స్ వరుసగా హారర్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వరుస విజయాలతో పాటు భారీ వసూళ్లను ఆయన సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కాంచన 3' నిర్మితమైంది. లారెన్స్ సరసన వేదిక .. ఓవియా నటించిన ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఇప్పటివరకూ వచ్చిన టీజర్ .. ట్రైలర్ మరింతగా భయపెట్టేలా ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు తాను చేసిన హారర్ సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని లారెన్స్ చెప్పిన దగ్గర నుంచి, అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. డిఫరెంట్ లుక్ తో లారెన్స్ కనిపించే ఈ సినిమా, ఆయనకి భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. 
Go Back to Shorts
lawrence
vedika
oviya

More Telugu News