ఏలూరులో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం.. చింతమనేనిని తోసేసిన కానిస్టేబుల్
- సీఆర్ రెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత
- ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నారని టీడీపీ ఆరోపణ
- రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు
పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ చింతమనేనిని తోసివేయడంతో ఆయన కింద పడబోయారు. ఈ పరిణామాలతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనేందుకు వచ్చిన ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం చింతమనేని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.