Pawan Kalyan: అభిమాని ఘనకార్యానికి కింద పడిపోయిన పవన్ కల్యాణ్!

షార్ట్స్‌లో చూడండి
అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కోసారి రాజకీయనేతలకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. విజయనగరంలో నేడు జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన పవన్ కల్యాణ్ ప్రసంగించేందుకు సన్నద్ధమవుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని దూకుడు ప్రదర్శించడంతో పవన్ కిందపడిపోయారు.

ఆ వ్యక్తి పవన్ కు పాదాభివందనం చేసే క్రమంలో వెనుక నుంచి కాళ్లను గట్టిగా పట్టుకోవడంతో పవన్ బ్యాలన్స్ ఆపుకోలేకపోయాడు. ఒక్కుదుటున కిందపడిపోయాడు. ఈ ఘటనతో పవన్ తత్తరపాటుకు గురైనట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఘటనలో మైక్ కూడా విరిగిపోయింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పవన్ పడిపోవడానికి కారణమైన అభిమానిని ఇవతలికి లాగి పోలీసులకు అప్పగించారు. అనంతరం పవన్ తన ప్రసంగం మొదలుపెట్టారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News