దమ్ముంటే మూడు సీట్లు గెలిచి చూపించండి: కేటీఆర్ సవాల్
- చౌకీదార్, హిందూమతమే అజెండా
- డైలాగ్‌లు చెప్పడం తప్ప చేసిందేమీ లేదు
- రాజకీయాల్లో ముద్ర వేసే నాయకుడు కావాలి
డైలాగ్‌లు చెప్పడం తప్ప మోదీ ఏమీ చేయలేదని విమర్శించారు. మోదీ, అమిత్‌షా, ఆరు రాష్ట్రాల సీఎంలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా బీజేపీకి 100 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. రాజకీయ పార్టీలను కేవలం రెండు సీట్లతో కదిలించిన కేసీఆర్, 16 సీట్లు వస్తే ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో చూస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.