ఎల్బీ స్టేడియంలో మాయావతి, పవన్ బహిరంగసభ.. సాయంత్రం నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

  • ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ, జనసేన బహిరంగసభ
  • హాజరుకానున్న మాయావతి, పవన్ కల్యాణ్
  • సాయంత్రం 4 గంటల నుంచి 7.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేనాని పవన్ కల్యాణ్ లు బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.

  • అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా పంపిస్తారు. 
  • ఏఆర్ పెట్రోల్ పంప్ కూడలి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు పంపిస్తారు. 
  • ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్ బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై-జంక్షన్ మీదుగా పంపిస్తారు.
  • బషీర్ బాగ్ కూడలి నుంచి వచ్చే వాహనాలను హైదర్ గూడ, కింగ్ కోఠి రోడ్డు వైపు మళ్లిస్తారు. 
  • అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ కూడలి నుంచి హిమాయత్ నగర్ వైపు పంపిస్తారు. 
  • రాజ్ మొహల్లా వైపు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను శ్మశానం కూడలి వైపు మళ్లిస్తారు. 
  • ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి బషీర్ బాగ్ కూడలి వైపు వచ్చే వాహనాలను పీసీఆర్ వద్ద నాంపల్లి వైపు పంపిస్తారు.
Go Back to Shorts
mayavati
Pawan Kalyan
bsp
janasena
lb stadium
taffic rules

More Telugu News