medchel: కొడంగల్ లో చెల్లని రూపాయి మేడ్చల్ లో చెల్లుతుందా?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
కొడంగల్ లో చెల్లని రూపాయి మేడ్చల్ లో చెల్లుతుందా? అంటూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. మేడ్చల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు పారేసిన ఈ చిత్తు కాగితాన్ని మీరు నెత్తిమీద పెట్టుకుంటారా? వాళ్లు మనకంటే తెలివైన వాళ్లా? కొడంగల్ వాళ్లకు తెలివి ఉంది, మనకు లేదా? అని ప్రశ్నించారు.

 సొంత జిల్లాలో, సొంత ఊరులోనే ఓడిపోయిన రేవంత్, ఇక్కడికొచ్చి ‘నేను అది చేస్తా, ఇది చేస్తా’ అంటే నమ్ముదామా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓ మంచి వ్యక్తిని ఇక్కడి నుంచి పోటీలోకి దింపితే గౌరవించేవాళ్లం కానీ, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నేరస్తుడు, ఒక దొంగ అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ దొంగను తీసుకొచ్చి మల్కాజ్ గిరి ప్రజలపై రుద్దుతామంటే, మనమేమన్నా అమాయకులమా? పిచ్చోళ్లమా? ఒకసారి ప్రజలు ఆలోచించాలని కోరారు.
Go Back to Shorts
medchel
malkajigiri
TRS
KTR
Revanth Reddy

More Telugu News