రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్ - పూజా హెగ్డే మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్ - పూజా హెగ్డే మూవీ

  • రాధాకృష్ణ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • 1970 నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • పాత్ర కోసం బరువు తగ్గిన ప్రభాస్  
ప్రభాస్ 19వ సినిమాగా 'సాహో' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మిగతా సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ గ్యాపులో ప్రభాస్ .. దర్శకుడు రాధాకృష్ణతో కలిసి సెట్స్ పైకి వచ్చేశాడు. ప్రభాస్ 20వ సినిమాగా ఇది నిర్మితమవుతోంది. ఇటీవలే యూరప్ లో రెండవ షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు.

ప్రభాస్ .. పూజా హెగ్డే తదితరులపై కొన్ని సన్నివేశాలను .. పాటలను చిత్రీకరించారు. దాంతో రెండవ షెడ్యూల్ పూర్తయింది. 1970 కాలంనాటి ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. పూర్వం .. ప్రస్తుతం అంటూ రెండు పట్టాలపై ఈ ప్రేమకథ పరిగెడుతుంది. ఈ కారణంగానే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా వదిలిన ప్రభాస్ ఫొటో చూస్తుంటే ఆయన బాగా బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం బరువు తగ్గడానికి ఆయన బాగానే కసరత్తు చేసి వుంటాడనిపిస్తోంది.
prabhas
pooja hegde

More Telugu News