vishal: కోలుకున్న విశాల్ .. షూటింగుకు హాజరు

షార్ట్స్‌లో చూడండి
విశాల్ కథానాయకుడిగా దర్శకుడు సుందర్. సి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా షూటింగులో విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలుకి .. చేతికి బలమైన గాయాలు అయ్యాయి. ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అభిమానులు అనుకున్నారు.

కానీ త్వరగానే కోలుకున్న విశాల్ .. ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. తదుపరి షెడ్యూల్ ను అజర్బైజాన్ లో ఈ రోజు నుంచే మొదలుపెట్టారు. విశాల్ .. తమన్నాపై అక్కడి అందమైన ప్రదేశాల్లో రెండు పాటలను ..  విశాల్ తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇంతకుముందు విశాల్ .. తమన్నా జంటగా నటించిన 'కత్తి సందై' పరాజయం పాలైంది .. తాజా చిత్రం హిట్ తెస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
vishal
tamannah

More Telugu News