తనను యాక్టర్ అన్న జగన్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు.. ఆ విషయం గుర్తుంచుకోవాలని హితవు
- నేను రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్‌ను
- అన్నీ తెలుసుకుని రాజకీయాల్లోకి వచ్చా
- నువ్వు రాజకీయాల్లోకి రాకముందు జైల్లో ఉండొచ్చావ్
తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏ పరిశ్రమ ఏర్పాటైనా స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల దరఖాస్తుల ద్వారా వసూలు చేసే సొమ్ముతో నిరుద్యోగ భృతి ఇస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని ఉద్యోగాలకు ఒకేసారి ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకొస్తామన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న 25 వేల మందిని పోలీసు సహాయకులుగా నియమిస్తామని పవన్ హామీ ఇచ్చారు.