lawrence: దర్శకుడిగా చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలనుంది: లారెన్స్

షార్ట్స్‌లో చూడండి
లారెన్స్ కథానాయకుడిగా 'కాంచన 3' నిర్మితమైంది. లారెన్స్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా వేదిక .. ఓవియా నటించారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంతోపాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ఈ వేదికపై లారెన్స్ మాట్లాడుతూ .. 'కాంచన 3' కూడా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుందని అన్నారు. తెలుగులో నేరుగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కథలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా చెప్పారు. గతంలో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నాగార్జునగారితో మరో సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఇక మొదటి నుంచి కూడా తనని ప్రోత్సహించిన చిరంజీవిగారితోను ఒక సినిమా తెరకెక్కించాలని ఉందని అన్నారు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి. 
Go Back to Shorts
lawrence
vedika
oviya

More Telugu News