nani: 'జెర్సీ' సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర చనిపోతుందట!

షార్ట్స్‌లో చూడండి
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా నిర్మితమైంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడే ఇది క్రికెటర్ రమణ్ లంబా జీవితం ఆధారంగా రూపొందుతుందనే టాక్ వచ్చింది.

రమణ్ లంబా క్రికెట్ ఆడుతుండగా తలకి బాల్ తగిలి చనిపోయాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర కూడా అదే విధంగా చనిపోతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సాధారణంగా హీరో చనిపోయే కథలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. కానీ సహజత్వం కోసం దర్శకుడు నెగెటివ్ క్లైమాక్స్ ను చిత్రీకరించాడని చెప్పుకుంటున్నారు. కొత్తగా .. కథకి తగిన ముగింపుగా ఉందనే ఉద్దేశంతో నాని కూడా ఓకే చెప్పేశాడని అంటున్నారు. మరి ఈ నెగెటివ్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.
Go Back to Shorts
nani
shraddha srinadh

More Telugu News