saitej: 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

షార్ట్స్‌లో చూడండి
సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా నిర్మితమైంది. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్' సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఈ వేడుకకి చిరంజీవిగానీ .. చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావలసి ఉందట. అయితే ఏపీ ఎన్నికల్లో 'జనసేన' పోటీ చేస్తుండటంతో, మీడియాకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లు రావడం లేదని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
saitej
kalyani
niveda

More Telugu News