‘సైకిల్’ చైన్ ని కేసీఆర్ ఎప్పుడో తెంచేశారు: పవన్ కల్యాణ్ సెటైర్లు
- ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవు
- వైసీపీ అభ్యర్థులకు టికెట్లు ఎందుకు?
- క్లబ్ లో కూర్చుని పేకాట ఆడుకోండి
ఈ సందర్భంగా సభకు హాజరైన అభిమానులు వేసిన ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ‘ఫ్యాన్’ కు రెక్కలు విరగలేదు, అది తిరగడానికి ‘పవర్’ లేదు అని చెప్పడంతో చప్పట్లు మార్మోగిపోయాయి. ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవని, ఇది వరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవారని, ఇప్పుడు భుజాన వేసుకుని మోసుకొస్తున్నారంటూ టీడీపీపై సెటైర్లు విసిరారు. వాళ్లు సైకిల్ ఎందుకు తొక్కట్లేదంటే, సైకిల్ చైన్ ని కేసీఆర్ ఎప్పుడో తెంచేశారని, చైన్ లేకుండా సైకిల్ తొక్కితే ఎక్కడికీ వెళ్లదు అక్కడే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.