గల్లా జయదేవ్ ఆ మాటేదో అప్పుడే మాట్లాడి ఉండొచ్చుగా!: పవన్ సూటి ప్రశ్న
Add ap7am to your home Screen

గల్లా జయదేవ్ ఆ మాటేదో అప్పుడే మాట్లాడి ఉండొచ్చుగా!: పవన్ సూటి ప్రశ్న

  • టీడీపీ మాట మార్చే పార్టీ
  • కంఠం తెగిపడాలే తప్ప మాట మార్చను
  • గుంటూరు రోడ్ షోలో పవన్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు గుంటూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు స్థానం జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలంటూ పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ రోడ్ షోలో పవన్ మాట్లాడుతూ, టీడీపీ పరిస్థితులను బట్టి మాట మార్చేస్తుందని, కంఠం తెగిపడాలే తప్ప తాను మాత్రం ఆడినమాట తప్పేది లేదని స్పష్టం చేశారు.

 మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంటులో గొంతెత్తిన గల్లా జయదేవ్ ఆ మాటేదో ముందే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రశ్నించకపోతే మొదట్లోనే ప్రధానిని నిలదీసి ఉంటే బాగుండేదని అన్నారు. టీడీపీ అవకాశవాద రాజకీయ పార్టీ అని అభివర్ణించిన పవన్ ఈ ఎన్నికల్లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఓడించి జనసేన అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితం అవుతోందని, మార్పు కోసం జనసేనకు ఓటేయాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan
Telugudesam

More Telugu News