చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని బాగానే కష్టపడుతున్నావు పవన్ కల్యాణ్: విజయసాయిరెడ్డి

  • బీఎస్పీకి ఇచ్చిన సీట్లలో వారే పోటీచేయాలిగా
  • మాయావతి పేరిట బిజినెస్ చేస్తున్నారా?
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి
చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకున్న పవన్ కల్యాణ్, బాగా కష్టపడుతూ ఆయనకు లాభం కలిగే పని చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "బిఎస్పీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు కేటాయించారు. ఆ స్థానాల్లో బిఎస్పీ అభ్యర్థులు పోటీ చేయాలి కదా? కాని మీ పార్టీ వారితో నామినేషన్లు వేయించడం ఏమిటి పవన్ కళ్యాణ్ గారూ? చివరికి మాయావతి పేరుతో కూడా బిజినెస్ చేస్తున్నారా? చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీకి బాగా కష్ట పడుతున్నారు" అని అన్నారు.



Go Back to Shorts
Vijayasai Reddy
Twitter
Pawan Kalyan
Jana Sena
Mayawati

More Telugu News