తానెంతో నమ్మిన అనుచరుల చేతుల్లోనే హతం... వైఎస్ వివేకా హత్య కేసును కొలిక్కి తెచ్చిన సిట్!
- హత్యకు పాల్పడింది చంద్రశేఖర్ రెడ్డి గ్యాంగ్
- వెనకున్నది పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి
- అరెస్ట్ లను అధికారికంగా చూపించే అవకాశం
ఈ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఇప్పటికే 40 మందిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హత్య తరువాత గంగిరెడ్డి ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశాడని కూడా సిట్ అధికారులు తేల్చారు. ఒకటి రెండు రోజుల్లోనే కేసు వివరాలను అధికారికంగా వెల్లడిస్తూ, అరెస్ట్ లను అధికారికంగా చూపించవచ్చని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.