Varun Tej: బాబాయ్ పార్టీలో తన తండ్రి చేరడంపై స్పందించిన వరుణ్ తేజ్!
నిన్న జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీలో కొణిదెల నాగబాబు చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు నరసాపురం నుంచి పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా టికెట్ ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తండ్రి జనసేనలో చేరికపై నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "మా నాన్న జనసేనలో చేరి, బాబాయ్ తో కలిసి పోటీ చేయనుండటం నాకు చాలా సంతోషకరం" అని వ్యాఖ్యానించారు.