మెగా హీరోకి ఈ సారి హిట్ ఖాయమట
- ప్రేమకథా చిత్రంగా 'చిత్రలహరి'
- హైలైట్ గా నిలవనున్న సునీల్ కామెడీ
- ఏప్రిల్ 12వ తేదీన విడుదల
విజయ్ పాత్రలో సాయిధరమ్ తేజ్ చేసే లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్, సునీల్ కామెడీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 'సరిగమ సినిమాస్' వారు ఓవర్సీస్ లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గతంలో ఓవర్సీస్ లో వీళ్లు డిస్ట్రిబ్యూట్ చేసిన 'ఛలో' .. 'గీత గోవిందం' సినిమాలు అక్కడ భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.