నేను పోటీ చేసే నియోజక వర్గాల విషయం ఓ గంటలో తేలుతుంది: పవన్ కల్యాణ్

  • జనరల్ బాడీదే తుది నిర్ణయం
  • రెండు నియోజకవర్గాలు ఎంపిక 
  • ట్విట్టర్ లో వెల్లడించిన పవన్ కల్యాణ్
తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయం ఓ గంటలో తేలుతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, "నేను పోటీ చేసే రెండు నియోజకవర్గాల విషయమై జనరల్ బాడీ తుది నిర్ణయం తీసుకుంటుంది. బహుశా ఓ గంటలో నాకు చెబుతారని అనుకుంటున్నా" అని అన్నారు. దీనిని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.  
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Twitter

More Telugu News