కార్తికేయ 'హిప్పీ' మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్తికేయ 'హిప్పీ' మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • ద్విభాషా చిత్రంగా 'హిప్పీ'
  • నాయికగా దిగాంగన
  • దర్శకుడిగా కృష్ణ పరిచయం  
తెలుగులో 'ఆర్ ఎక్స్ 100' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, హీరోగా కార్తికేయ ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. దాంతో ఆయనను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి. వాటిలో తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక ద్విభాషా చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు .. ఆ సినిమా పేరే 'హిప్పీ'.

తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను వదలనున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో వున్నారు. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కథానాయికగా ఈ సినిమాతో 'దిగాంగన' పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. నివాస్ కె. ప్రసన్న అందించిన సంగీతం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.
karthikeya
digangana

More Telugu News