జనసేనకు ఎందుకు ఓటు వేయాలంటే.. నాదెండ్ల మనోహర్ వీడియో విడుదల!
- తొలిసారి ఓటర్ల ముందు అద్భుతమైన అవకాశముంది
- కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పవన్ సేవ చేస్తారు
- జనసేనకు 25 సంవత్సరాల విజన్ ఉంది
ప్రస్తుతం యువతకు గొప్ప భవిష్యత్ కావాలని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీకి పాతికేళ్ల భవిష్యత్తుపై ఓ విజన్ ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో యువత జనసేనతో చేతులు కలపాలనీ, భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఆదర్శవంతంగా ఉన్న నేతలను ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం ఓట్ ఫర్ జనసేన, ఓట్ ఫర్ గ్లాస్, జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.